చిరుతో సుకుమార్?
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకరేమో మాస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. మరొకరు క్లాస్ సినిమాలతోనే హీరోలోని మాస్ ఎలిమెంట్స్‌ని బాగా ఎలివేట్ చేసి చూపించగల తెలివైన దర్శకుడు. మరి ఇలాంటి కలయికలో సినిమా అంటే కేవలం అభిమానులకే కాదు, ఫిలిం ఇండస్ట్రీకి కూడా కనుల పండుగే. ఇంతకీ ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్‌ది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. తాజాగా సుక్కు, మెగాస్టార్‌కి ఒక కథను వినిపించారని సమాచారం. ఆ కథ చిరుకి బాగా నచ్చడంతో.. డెవలప్ చేసుకోమని చెప్పారట. ప్రస్తుతం సుకుమార్ 'రంగస్థలం' సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ పూర్తైన వెంటనే చిరు సబ్జెక్టుని తీర్చిదిద్దే పనిలో సుక్కు పడతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇక చిరు కూడా ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత చిరు, సుకుమార్ సినిమా పట్టాలెక్కిస్తారేమో చూడాలి. అయితే చిరు ఇప్పటికే 'సైరా' తర్వాత బోయపాటితో సినిమా చేయాల్సి ఉండగా...ఈ మధ్య సుకుమార్ కూడా మహేష్ బాబుకి ఒక కథని వినిపించినట్లు మీడియాలో కథనాలు వినిపించాయి. మరి వీటిలో ఏ ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com