అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్ ఇద్దరు ఇద్దరే
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్...ఈ ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి. అల్లు అర్జున్ మెగాస్టార్ డాడీ చిత్రంలో ఓ డాన్స్ మూమెంట్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత గంగ్రోతి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అల్లు అర్జున్ రెండవ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక అఖిల్ విషయానికి వస్తే...అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించిన మనం సినిమాలో చిన్న పాత్ర ద్వారా అఖిల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అఖిల్.
అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన డాడీ సినిమా సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందింది. అలాగే అఖిల్ ఎంట్రీ ఇచ్చిన మనం సినిమా కూడా సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రూపొందింది. అలాగే అల్లు అర్జున్ అంటే ఇంగ్లీషు అక్షరాలు ఎ ఎ. అలాగే అక్కినేని అఖిల్ అంటే ఎ ఎ. ప్రస్తుతం అఖిల్ రెండవ సినిమాని సుకుమార్ దర్శకత్వం వహించనున్నట్టు...దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
అల్లు అర్జున్ రెండో సినిమాను సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే. దీనిని బట్టి చూస్తే...అక్కినేని అఖిల్ కూడా రెండవ సినిమాను సుకుమార్ దర్శకత్వంలోనే చేసే అవకాశం ఉంది. మరి..ఏం జరగనుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com