సమర్పణలోనూ వదలని సుకుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ సినిమాలు అంటేనే సమ్‌థింగ్ స్పెషల్. అలాగే హుషారుగా సాగే ఐటమ్ సాంగ్స్ కూడా ఉంటాయి. 'ఆర్య' నుంచి '1 నేనొక్కడినే' వరకు ఐటమ్ సాంగ్ లేకుండా సుకుమార్ సినిమా రూపొందలేదు. రానున్న 'నాన్నకు ప్రేమతో' లోనూ ఓ ప్రత్యేక గీతముందని ఇదివరకే వార్తలు వినిపించాయి.
కేవలం తను దర్శకత్వం వహించే సినిమాలకే కాకుండా.. తన సమర్పణలో వస్తున్న 'కుమారి 21 ఎఫ్' సినిమాలోనూ తన శైలిలో సాగే ఐటమ్‌కి చోటిచ్చాడట సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ గీతాన్ని ఎంతో శ్రద్ధగా ట్యూన్ చేశాడని సమాచారం. ' కుమారి 21 ఎఫ్' ఆడియోని ఈ నెల 31న.. సినిమాని వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నారు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ ఇందులో హీరోహీరోయిన్స్‌గా నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments