అప్పుడు నాగచైతన్య .. ఇప్పుడు రాజ్ తరుణ్...
- IndiaGlitz, [Tuesday,November 24 2015]
తెలుగు సినిమా పరిశ్రమలో మరో కొత్త సెంటిమెంట్ పుట్టింది. అదేమిటంటే.. సుకుమార్ చేతిలో పడి ఏ హీరో అయినా మూడో సినిమా చేస్తే ఆ సినిమా హిట్టే.. అనేదే ఆ కొత్త సెంటిమెంట్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా '100 % లవ్'.. యువ కథానాయకుడు నాగచైతన్యకి కూడా మూడో సినిమానే.
ఆ సినిమాతో ఓ మెమరబుల్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు చైతన్య. ఇక సుకుమార్ నిర్మాతగా మారి తనే కథనందించిన 'కుమారి 21 ఎఫ్' కూడా అందులోని హీరో రాజ్ తరుణ్‌కి మూడో సినిమానే. ఈ సినిమాతో రాజ్ తన కెరీర్‌లోనే బెస్ట్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో.. సుకుమార్ చేతిలో ఓ యంగ్ హీరో మూడో సినిమా పడితే.. అది హిట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద.. యంగ్ హీరోలకు మూడో చిత్రాల పరంగా సుకుమార్ లక్కీ హ్యాండ్ అన్నమాట.