చిరు సినిమా పై స్పందించిన సుకుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ గత కొంత కాలంగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని కూడా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈ కాంబోపై భారీ అంచనాలే నెలకొన్నాయి కూడా. గత రెండు నెలలుగా మీడియాలో నానుతున్న ఈ హాట్ టాపిక్.. ఆఖరికి దర్శకుడు సుకుమార్ చెవిన పడింది. దాంతో సుకుమార్ ఎట్టకేలకు స్పందించారు. చిరంజీవితో సినిమా చేస్తున్న విషయాన్ని ఆయన ఖండించారు. అవి ఒట్టి పుకార్లు మాత్రమేనని అన్నారు.
చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని.. ఆయనకు వీరాభిమానినని కూడా చెబుతూ.. వారిద్దరి మధ్య ఎటువంటి కథా చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే చిరంజీవితో కలిసి పనిచేయడం కల అని మాత్రం వెల్లడించారు.
మరి ఆ కలను సాకారం చేసుకునే దిశగా సుకుమార్ భవిష్యత్తులో అడుగులు వేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే.. అల్లు అర్జున్‌తో మూడోసారి జట్టు కట్టనున్నట్టు ప్రకటించారు సుకుమార్. ఇదిలా ఉంటే.. సుకుమార్ రూపొందించిన ‘రంగస్థలం’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com