ఎన్.టి.ఆర్ తో ప్లాన్ చేస్తున్నారట...

  • IndiaGlitz, [Saturday,September 05 2015]

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు.

ఉయ్యాలా జంపాలా', సినిమా చూపిస్త మావ' చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపును పొందిన రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్య, రోబో, వన్, లింగా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం.

సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్ ను పూర్తిచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషనల్ వీడియో సాంగ్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఒక సాంగ్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందట. దాన్ని కూడా పూర్తి చేసి సినిమాని దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

More News

ఇల్లీ బేబి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు...

జగన సుందరిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగులో సినిమాలు చేయడం లేదు.

కంచె గురించి మహేష్ స్పందించడానికి కారణం అదేనా...?

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు.

'బ్రూస్ లీ' కామెడి ?

మార్షల్ ఆర్ట్స్ లో నెంబర్ వన్ అయిన బ్రూస్ లీ కామెడి చేయడమేంటని అనుకుంటున్నారా. ఆయన గురించి కాదులేండి.

ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా...నితిన్...?

నితిన్ తో సినిమా చేయాలని మల్లిడి వేణు అనే యువదర్శకుడు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు.మల్లిడి వేణు చెప్పిన కథ నచ్చి నితిన్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు

'జయసూర్య' మూవీ రివ్యూ

మాస్ సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విశాల్ చేసిన ఇంద్రుడు, పల్నాడు సినిమాలను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది.