బన్నీ చెప్పాడు.. ప్రామిస్.. ఇక తప్పకుండా చేస్తా!
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే హీరోయిన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట్లో ఈ చిత్రంలో రష్మికను కాకుండా అచ్చమైన తెలుగమ్మాయినే తీసుకోవాలనుకున్నారట. అల్లు అర్జున్ కూడా తెలుగు హీరోయినే కావాలని పట్టుబడ్డాడని సమాచారం.
అయితే కొన్ని కారణాల వల్ల తెలుగమ్మాయిని కాకుండా రష్మికనే ‘పుష్ప’లోకి తీసుకున్నామని సుకుమార్ వెల్లడించారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ స్నేహితుడు హరిప్రసాద్ జక్కా నిర్మించిన ప్లేబ్యాక్ సినిమా ఇటీవలే రిలీజై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ... ప్లేబ్యాక్ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్యపై ప్రశంసలు కురిపించారు. అనన్య తెలుగింటి అమ్మాయి కావడం విశేషం. ‘ప్లే బ్యాక్’ సినిమాలో అనన్య చాలా సహజంగా నటించిందని... అయితే తెలుగు రాని హీరోయిన్లను పెట్టుకుంటే వారితో డైలాగులు చెప్పించడం కొంత కష్టమని సుకుమార్ తెలిపారు.
అందుకే తన సినిమాల్లో ఎక్కువగా తెలుగు వచ్చినవాళ్లనే పెట్టుకున్నానన్నారు. రంగస్థలంలో సమంత, ప్రకాశ్‌రాజ్ తప్ప అందరూ తెలుగువాళ్లేనన్నారు. కానీ వీళ్లిద్దరు కూడా తెలుగులో డైలాగ్స్ ఈజీగా చెప్పేవారన్నారు. అయితే తన తర్వాతి సినిమాలో తప్పకుండా తెలుగమ్మాయినే హీరోయిన్గా పెట్టుకుంటానని ఈ సందర్భంగా సుక్కు ప్రామిస్ చేశారు. పుష్ప సినిమాలో తెలుగమ్మాయిని పెట్టమని బన్నీ చెప్పాడన్నారు. అంత పెద్ద హీరో ఈ మాట చెప్పడం సాధారణ విషయమేమీ కాదన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వచ్చిన రష్మికను పెట్టుకున్నానని సుక్కు చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments