సుకుమార్ నెక్ట్స్ టార్గెట్ ప్రభాస్ అట
Send us your feedback to audioarticles@vaarta.com
కథలను చాలా వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించడం.. దర్శకుడు సుకుమార్ స్టైల్. సినిమా చూస్తున్నంతసేపు లాజికల్‌గా ప్రతీ సన్నివేశం కరెక్ట్ అనిపించేలా చిత్రీకరించడం సుకుమార్‌కే చెల్లు. ఈ దర్శకుడు.. ఇప్పటికే అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి అగ్రకథానాయకులతో సినిమాలు చేశారు. తాజాగా ‘రంగస్థలం’ కోసం రామ్ చరణ్‌తో కూడా జట్టు కట్టారు.
తాజాగా.. తన నెక్స్ట్ టార్గెట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని స్వయంగా సుకుమారే వెల్లడించారు. ఓ మీడియాలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పై విధంగా స్పందించారు సుక్కు. సైకలాజికల్‌గా భావోద్వేగ సన్నివేశాలని తెరకెక్కించడంలో దిట్ట అయిన సుక్కు, ఎటువంటి సన్నివేశంలోనైనా చక్కగా నటించగల ప్రభాస్ కలయికలో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. మరి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. తదుపరి సినిమా కోసమైనా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే.. సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com