యంగ్ హీరోతో సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్?
Send us your feedback to audioarticles@vaarta.com
భిన్నమైన కథలతో.. వైవిధ్యమైన కథనంతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట దర్శకుడు సుకుమార్. ప్రేక్షకులను అబ్బుర పరచడంతో పాటు.. వెండితెరపై రిచ్‌నెస్ తీసుకురావడం కోసం భారీ లెవెల్‌లో ఖర్చు చేయిస్తూ ఉంటారు.
ఇక ఆ సినిమాల్లో నటించేది అగ్ర హీరోలైతే ఆ ఖర్చు మరింత భారీగా ఉంటుంది. ఈ విషయాన్ని 2014లో వచ్చిన '1 నేనొక్కడినే', 2016లో విడుదలైన 'నాన్నకు ప్రేమతో' సినిమాలే చెబుతాయి. తాజాగా రామ్ చరణ్‌తో కలిసి చేసిన 'రంగస్థలం' కోసం ఏకంగా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా హైదరాబాద్‌లో సెట్ వేయించేశారు ఈ లెక్కల మాస్టర్.
ఇదిలా ఉంటే.. బన్నీతో కలిసి మరో సినిమాను రూపొందిస్తానని పలుమార్లు ఈ దర్శకుడు చెప్పారు. దాంతో 'రంగస్థలం' సినిమా తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ బన్నీతో ఉంటుందని అంతా ఊహించారు. కాని సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో, ఓ యంగ్ హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. దాని కోసం కథను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివివరాలు వెల్లడికానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments