సుకుమార్ తదుపరి చిత్రం ఎవరితో..
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్...ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో..మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్..చరణ్ తో మూవీ చేయాలనుకుంటున్నాడట. చరణ్ కోసం ఓ లైన్ రెడీ చేసాడట. నాన్నకు ప్రేమతో..మూవీ పూర్తి అయిన తర్వాత చరణ్ మూవీ స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడని సమాచారం. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తాడట. ఇదిలా ఉంటే..చరణ్ తమిళ రీమేక్ తని ఓరువన్ మూవీని వచ్చే నెలలో స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత గౌతమ్ మీనన్ తో ఓ సినిమా, బాబాయ్ పవన్ ప్రొడక్షన్ లో ఓ మూవీ చేయడానికి ప్లాన్ చేసారు. మరి..సుకుమార్ చరణ్ తో మూవీ చేయాలంటే చాలా రోజులు వెయిట్ చేయాలి. మరి..సుకుమార్ చరణ్ కోసం వెయిట్ చేస్తాడా..?లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com