చరణ్ కోసం సుక్కు కొత్త లుక్....
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రాంచరణ్ రీసెంట్‌గా ధృవ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాంచరణ్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. యాబై కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారట.
ఈ సినిమా కోసం సుకుమార్ చరణ్‌ని గడ్డం పెంచమన్నాడట. ఇంతకు ముందు చరణ్ రగ్డ్ లుక్‌తో కనిపించినా, సుకుమార్ మాత్రం చరణ్‌ను పూర్తిస్థాయి గడ్డం ఉన్న క్యారెక్టర్‌లో చూపించడానికి రెడీ అయ్యాడట. సుకుమార్ తన గత చిత్రం `నాన్నకు ప్రేమతో..`లో ఎన్టీఆర్‌ను కోన్ బియర్డ్ లుక్‌లో చూపించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments