ఆ నిర్ణ‌యాన్ని హీరోకే వ‌దిలేసిన సుకుమార్

  • IndiaGlitz, [Friday,February 12 2016]

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో సూప‌ర్ స‌క్సెస్ సాధించిన సుకుమార్...త‌దుప‌రి చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ తో చేయ‌డానికి ఫిక్స్ అయ్యారు. చ‌ర‌ణ్ కోసం డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ రెడీ చేసే ప‌నిలో సుకుమార్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్ తో చేసే సినిమా ఏ బ్యాన‌ర్ లో చేయాల‌నేది సుకుమార్ కి ఓ స‌మస్య‌గా మారింది.

ఎందుకంటే... ఓ వైపు ఆర్య సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసిన దిల్ రాజు రామ్ చర‌ణ్ తో చేసే మూవీని నిర్మిస్తానంటుంటే..మ‌రో వైపు శ్రీమంతుడు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ కూడా చ‌ర‌ణ్‌, సుక్కు మూవీని నిర్మిస్తామంటున్నాయ‌ట‌. ఇలా ఇద్ద‌రు నిర్మాత‌లు పోటీప‌డుతుండ‌డంతో సుకుమార్ ఎవ‌రికి చేయాల‌నే విష‌యంలో నిర్ణ‌యం తీసుకోలేక ఆ నిర్ణ‌యాధికారం హీరో రామ్ చ‌ర‌ణ్ కే వ‌దిలేసాడ‌ట. మ‌రి రామ్ చ‌ర‌ణ్ ఏ నిర్మాత‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో చూడాలి.