సుకుమార్ చేతుల మీదుగా 'U కథే హీరో' మోషన్ పోస్టర్ లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
కొవెరా క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న 'U కథే హీరో' చిత్ర మోషన్ పోస్టర్ ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా లైన్ వినగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. మోషన్ పోస్టర్ ని కూడా కధానుగుణంగా చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను".
దర్శకుడు కొవెరా మాట్లాడుతూ "U మోషన్ పోస్టర్ సుకుమార్ గారి చేతులమీదుగా లాంచ్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. నేను V. విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేసాను. కొన్ని సినిమాలకి రైటర్ గా కూడా చేసి, మొదటి ప్రయత్నంగా 'U' మూవీని డైరెక్షన్ చేస్తున్నాను.
స్క్రీన్ ప్లే రచయిత మధు మాట్లాడుతూ"ఈ సినిమాకి వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా అనిపించింది. అందరూ చెప్పే మాటే అయినా ఈ కధ చాలా కొత్తగా ఉంటుంది. అందుకే "కథే హీరో" అని క్యాప్షన్ గా పెట్టాం. మా సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసిన సుకుమార్ గారికి ధన్యవాదాలు.
త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో కొత్త హీరో, హీరోయిన్ లతో బాటు తనికెళ్ళ భరణి గారు, శుభలేఖ సుధాకర్ గారు కీలక పాత్రలు పోషిస్తునారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com