అయినా సుకుమార్ వదలడం లేదు
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ సినిమాలు అంటే తెలివితేటలకు పరీక్షలు పెట్టే సినిమాలన్నది కొందరి సినిమా ప్రేమికుల మాట. అతని గత చిత్రం '1 నేనొక్కడినే' అయితే ఇందుకు పూర్తిస్థాయి ఉదాహరణ. సినిమా ఫలితం మాట ఎలా ఉన్నా.. దర్శకుడుగా సుకుమార్ నవ తరం దర్శకులకు స్ఫూర్తినిస్తుంటాడు కూడా.
ఇదిలా ఉంటే.. గతంలో తన సినిమాలకి ఎక్కువగా సమ్మర్ సీజన్‌నే టార్గెట్ చేస్తూ వచ్చిన సుకుమార్.. తాజాగా తన శైలిని మార్చుకున్నాడు. ప్రీవియస్ మూవీ '1 నేనొక్కడినే' ని సంక్రాంతి సీజన్ కి వచ్చేలా చూసుకున్న ఈ ప్రతిభావంతుడు.. తాజాగా ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న 'నాన్నకు ప్రేమతో'ని కూడా ముగ్గుల పండక్కే వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సమ్మర్ సీజన్‌లా సంక్రాంతి సీజన్ కలిసి రాకపోయినా సుకుమార్ మాత్రం వదలడం లేదు. సుకుమార్ పట్టుదల చూసి ఈ సారైనా ఆ సీజన్ బ్లాక్‌బస్టర్‌ని ఇస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com