సుకుమార్.. ముచ్చటగా మూడోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
'రంగస్థలం'తో కెరీర్ బెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్. ఈ వేసవి ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా.. విడుదల అన్ని చోట్ల వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా అనే కాదు.. వేసవిలో విడుదలైన ప్రతీ సినిమా సుకుమార్‌కు సాలిడ్ హిట్ ఇస్తోంది. కాస్త వివరాల్లోకి వెళితే.. సుకుమార్ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే సినిమా ‘ఆర్య’. వన్ సైడ్ లవ్ అనే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 7, 2004న విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
అలాగే.. 2011లో నాగ చైతన్య, తమన్నా హీరోహీరోయిన్లుగా ‘100% లవ్’ ను తెరకెక్కించారు సుకుమార్. చదువు నేపథ్యంలో సాగే ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మే 6, 2011న విడుదలై ఘన విజయం సాధించింది. కట్ చేస్తే.. ఈ వేసవికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ రివేంజ్ డ్రామా మార్చి 30న విడుదలై ఘనవిజయం సాధించింది. మొత్తానికి.. సుకుమార్‌కు వేసవి సీజన్ భలేగా కలిసొస్తుందనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com