తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సుక్కు సినిమా?

  • IndiaGlitz, [Thursday,April 30 2020]

వైవిధ్య‌మైన కాన్సెప్ట్‌, బ్యాక్‌డ్రాప్‌తో సినిమాను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో సుకుమార్ ఒక‌రు. ఈ డైరెక్ట‌ర్ సినిమా వ‌చ్చి అప్పుడే రెండేళ్ల‌కావ‌స్తుంది. ఎందుకంటే రామ్‌చ‌ర‌ణ్‌తో రంగ‌స్థ‌లం వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను సాధించిన త‌ర్వాత సుకుమార్ మ‌హేశ్‌తో సిన‌మా చేయ‌డానికి రెడీ అయ్యాడు. అయితే మ‌హేశ్ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యాడు. త‌ర్వాత బ‌న్నీని అప్రోచ్ అయ్యాడు. క‌థ‌కు ఓకే చెప్పిన బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాతే చేస్తాన‌ని చెప్పాడు. దానికి సుక్కు ఒప్పుకున్నాడు. అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత బ‌న్నీ, సుక్కు సినిమా స్టార్ట్ అయ్యింది.

అయితే రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ తెలంగాణ సాయుధ పోరాటంపై సినిమా చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆ ప్రాజెక్ట్ వ‌ర్కవుట్ కాలేదు. త‌ర్వాత‌నే సుక్కు పుష్ప క‌థ‌ను రాసుకున్నారు. దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేయ‌డానికి రెడీ అయ్యారు. షూటింగ్‌కి స‌ర్వం సిద్ధ‌మైంది. అయితే క‌రోనా ప్ర‌భావంతో షూటింగ్ ఆగిపోయింది. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గ‌గానే పుష్ప సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోయే ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

బాల‌య్యతో మ‌ళ్లీ మూవీ చేయాల‌నుకుంటున్న యంగ్ డైరెక్ట‌ర్‌

కుర్ర ద‌ర్శ‌కులు ఈ మ‌ధ్య కొత్త కొత్త కాన్సెప్టుల‌తో స‌త్తా చాటుతున్నారు. మంచి విజ‌యాల‌ను ద‌క్కించుకుంటున్నారు. స‌క్సెస్‌ఫుల్‌గా ట్రావెల్ అవుతున్న యంగ్ డైరెక్ట‌ర్స్‌లో అనీల్ రావిపూడి ఒక‌రు.

బుట్ట‌బొమ్మ‌కు మ‌రో క్రెడిట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది.

గుడ్‌బై మై ఫ్రెండ్.. రిషి కపూర్ మృతిపై చిరు ట్వీట్

బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెంది 24 గంటలు గడవక మునుపే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.

మరో విషాదం.. దిగ్గజ నటుడు రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెంది 24 గంటలు గడవక మునుపే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.

మగవారికే ‘కరోనా’ ఎక్కువగా సోకడం వెనుక..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ థాటికి ప్రపంచ దేశాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాతపడ్డారు.