తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సుక్కు సినిమా?
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన కాన్సెప్ట్, బ్యాక్‌డ్రాప్‌తో సినిమాను తెరకెక్కించే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈ డైరెక్టర్ సినిమా వచ్చి అప్పుడే రెండేళ్లకావస్తుంది. ఎందుకంటే రామ్‌చరణ్‌తో రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్‌ను సాధించిన తర్వాత సుకుమార్ మహేశ్‌తో సినమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే మహేశ్ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యాడు. తర్వాత బన్నీని అప్రోచ్ అయ్యాడు. కథకు ఓకే చెప్పిన బన్నీ అల వైకుంఠపురములో తర్వాతే చేస్తానని చెప్పాడు. దానికి సుక్కు ఒప్పుకున్నాడు. అల వైకుంఠపురములో తర్వాత బన్నీ, సుక్కు సినిమా స్టార్ట్ అయ్యింది.
అయితే రంగస్థలం తర్వాత సుకుమార్ తెలంగాణ సాయుధ పోరాటంపై సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. తర్వాతనే సుక్కు పుష్ప కథను రాసుకున్నారు. దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేయడానికి రెడీ అయ్యారు. షూటింగ్‌కి సర్వం సిద్ధమైంది. అయితే కరోనా ప్రభావంతో షూటింగ్ ఆగిపోయింది. కరోనా ఎఫెక్ట్ తగ్గగానే పుష్ప సినిమాను తెరకెక్కించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com