సుకుమార్.. ముచ్చటగా మూడోసారి

  • IndiaGlitz, [Friday,February 16 2018]

బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై 14 ఏళ్లు అవుతోంది. అయితే.. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఇప్ప‌టివరకు విడుద‌లైన సినిమాల సంఖ్య మాత్రం ఆరే. ప్ర‌స్తుతం ఏడో చిత్రంగా రంగస్థలం' చేస్తున్నాడు. రామ్ చరణ్, సమంత జంటగా న‌టించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెర‌కెక్కుతోంది. 1985 నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని వేసవి ఆరంభంలో అంటే మార్చి 30న విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. సుకుమార్ కెరీర్‌లో ప‌క్కా హిట్ చిత్రాలుగా నిలిచిన‌ ఆర్య', 100% లవ్' కూడా వైవిధ్యమైన ప్రేమకథలతో తెర‌కెక్కి వేసవిలోనే విడుదల అయ్యాయి. మ‌రి ముచ్చ‌ట‌గా మూడోసారి.. రంగస్థలం' కూడా తనకి అచ్చొచ్చిన వేసవిలోనే విడుదల కానుండ‌డం చూస్తుంటే.. సుకుమార్ ఖాతాలో మ‌రో హిట్ చేరేలానే ఉంది. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

More News

నితిన్ జోడీగా రాశి ఖ‌న్నా?

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'తొలి ప్రేమ' సినిమా విజ‌యంతో మ‌రోసారి ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డింది ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ సినిమాలో వ‌ర్ష పాత్ర‌లో యువ‌త‌రాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ని..తాజాగా ఓ మంచి అవ‌కాశం వ‌రించింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

వరుణ్ మెగా కుటుంబం గర్వపడే సినిమా చేశాడు: మెగాస్టార్ చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన 'తొలిప్రేమ'

'చెన్నై చిన్నోడు' ఆడియో లాంచ్

జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూ సంగీతాన్ని సమకూర్చిన ఓ తమిళ చిత్రాన్ని 'చెన్నైచిన్నోడు'

సుమంత్ కొత్త సినిమా టైటిల్

చాలా కాలం గ్యాప్ తర్వాత 'మళ్ళీరావా' సినిమాతో విజయాన్ని అందుకున్నారు సుమంత్.

దర్శకుడికి నాగశౌర్య ఖరీదైన కానుక

ఆనందాన్ని పది మందితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుందంటారు.