‘పుష్ప’.. సుక్కు మరో ప్లాన్!!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విలక్షణ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడో వెళ్లాల్సింది. కానీ.. కరోనా కారణంగా ఆగింది. ప్రభుత్వం 40-50 మంది చిత్రీకరణ చేసుకోవచ్చునని చెప్పినప్పటికీ అంత తక్కువ మందితో అయితే ఈ సినిమాను చిత్రీకరించలేమని చిత్ర యూనిట్ ఇంకా సినిమా షూటింగే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడిప్పుడే మేకర్స్, స్టార్స్ అందరూ నెమ్మదిగా షూటింగ్స్‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఈ కమ్రంలో బన్నీ, సుక్కు అండ్ టీమ్ ‘పుష్ప’ షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటుందట..
నిజానికి ఈ సినిమా షూటింగ్‌ను కేరళ అడవుల్లో చిత్రీకరించాలనుకున్నారు. అల్లు అర్జున్ లేకుండా కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే ఈలోపు కరోనా వైరస్ ప్రభావం ప్రారంభం కావడంతో యూనిట్ వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు ‘పుష్ప’ యూనిట్ కేరళ వెళ్లే ఆలోచన చేయడం లేదు. ముందుగా ఉభయగోదావరి జిల్లాల సమీపంలో అడవుల్లో చిత్రీకరించాలనుకున్నా. వద్దనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో చిత్రీకరణ జరిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సుక్కు అండ్ టీమ్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments