సప్తగిరి జర్నీ చాలా చాలా బాగుంది - సుకుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటిస్తోన్న ద్వితీయ చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'. హిందీలో సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన 'జాలీ ఎల్.ఎల్.బి'కి రీమేక్ ఇది. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై ప్రముఖ హోమియోపతి వైద్యులు, టేస్ట్‌ఫుల్ నిర్మాత డా. రవికిరణ్ చరణ్ లక్కాకులని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'.
డైలాగ్ కింగ్ సాయికుమార్, డా. శివప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని నాలుగో పాటని బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి, డైరెక్టర్ చరణ్ లక్కాకుల, సంగీత దర్శకుడు బుల్గానిన్, నిర్మాత డా. రవికిరణ్ పాల్గొన్నారు.
బ్రిలయంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ - ''సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుండి తెల్సు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' మంచి హిట్ అయ్యింది. మళ్లీ 'సప్తగిరి ఎల్.ఎల్.బి'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పాటలు చూశాను. చాలా బాగున్నాయి. ఎవరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చేసి వుంటాడు అనుకున్నా. కానీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ బుల్గానిన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ చేశాడు. సప్తగిరి డ్యాన్స్‌లు, ఫైట్స్ చూసి షాక్ అయ్యా.
రజనీకాంత్, చిరంజీవిగారు మిక్స్ అయితే ఎలా వుంటుందో సప్తగిరి అలా కన్పించాడు. తనకంటూ ఒక సెపరేట్ మార్కెట్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అతని జర్నీ చాలా చాలా బాగుంది. రామజోగయ్య శాస్త్రి మంచి లిరిక్స్ రాశారు. డైరెక్టర్ చరణ్ ఎప్పట్నుంచో తెల్సు. అప్పుడప్పుడు కలుస్తుంటాం. చాలా టాలెంట్ వున్న డైరెక్టర్. నిర్మాత రవికిరణ్ మల్లెపువ్వులాంటి ప్రొడ్యూసర్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు'' అన్నారు.
సంగీత దర్శకుడు బుల్గానిన్ మాట్లాడుతూ - ''నాకు ఇష్టమైన పాటని సుకుమార్‌గారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.
దర్శకుడు చరణ్ లక్కాకుల మాట్లాడుతూ - ''ఎడిటర్ మోహన్‌గారి దగ్గర సుకుమార్‌గారు, నేను కలిసి వర్క్ చేశాం. గ్రేట్ డైరెక్టర్‌గా ఎదిగారు సుకుమార్. ఆయన సాంగ్స్, ట్రైలర్ చూసి చాలా మంచి సినిమా చేశావ్! కంగ్రాట్స్ అని చెప్పడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను'' అన్నారు.
హీరో సప్తగిరి మాట్లాడుతూ - ''నేను ఇష్టపడే మంచి యూనిక్ వున్న డైరెక్టర్స్‌లో సుకుమార్‌గారు ఒకరు. ఈ చిత్రంలో కైలాష్ ఖేర్ పాడిన నాలుగవ పాటని సుకుమార్‌గారు రిలీజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు'' అన్నారు.
నిర్మాత డా. రవికిరణ్ మాట్లాడుతూ - ''రామజోగయ్య శాస్త్రి రాసిన నాలుగవ పాటని కైలాష్ ఖేర్ పాడారు. ఈ పాట చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంది. మంచి సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్‌గారు మా పాట లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ఆయనకి మా యూనిట్ తరపున ధన్యవాదాలు'' అన్నారు.
డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో కామెడీ కింగ్ సప్తగిరి సరసన కశిష్ వోరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కో-డైరెక్టర్: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్.ఆర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: అర్జున్, పాటలు: చంద్రబోస్, కందికొండ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్, దర్శకత్వం: చరణ్ లక్కాకుల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments