ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను - సుకుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `ఈ మాయ పేరేమిటో`. కావ్యా థాపర్ హీరోయిన్. వి.ఎస్.ఎ వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ నెల 21న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో...
సి.కల్యాణ్ మాట్లాడుతూ - ``టైటిల్‌కు తగ్గట్టుగానే డెఫనెట్‌గా మాయ చేసి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. విజయ్ కష్టానికి తప్పకుండా ప్రతి ఫలం దక్కుతుంది. రాహుల్ వాళ్ల తండ్రి విజయ్ చెప్పుకునే రేంజ్‌కు రాహుల్ సక్సెస్ సాధిస్తాడు`` అన్నారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - ``విజయ్‌గారు చాలా క్రింద స్టేజి నుండి ఈ రేంజ్‌కు ఎదిగారు. తను మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీలోనే ఉంచాలనుకున్నాడు. అందులో భాగంగా రాహుల్‌ని హీరో చేయడానికి అన్ని రకాలుగా ట్రయినింగ్ ఇప్పించాడు. తనే ప్రొడ్యూసర్‌గా విజయ్ చేసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, యూనిట్‌కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చూశాను. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది`` అన్నారు.
యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ - ``సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ కావాల్సిన విజయ్ మాస్టర్, ఆయన బిడ్డలు దివ్యా, రాహుల్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
డైరెక్టర్ రాము కొప్పుల మాట్లాడుతూ - ``35 ఏళ్లు విజయ్ మాస్టర్‌గారు ఎంత కష్టపడ్డారో.. ఈ రెండేళ్లు అంత కంటే ఎక్కువగా కష్టపడ్డారు. ఈ సినిమా ఈ స్టేజ్‌కు రావడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. దివ్యగారికి థాంక్స్. చాలా మంచి నిర్మాత. సినిమాకు ఏం కావాలో తెలిసి, కథను నమ్మి సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సినిమాటోగ్రఫీ శ్యామ్ దత్‌గారు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాగారు వాళ్ల సొంత తమ్ముడి సినిమాకు సపోర్ట్ చేసినట్లు చేశారు. ఎడిటర్ నవీన్ నూలి, లిరిక్ రైటర్‌కి థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మగారు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. రాహుల్ వంటి హీరో నా సినిమాకు హీరోగా దొరకడం నా అదృష్టం. రాహుల్ డాన్స్, ఫైట్స్ అన్నిఈజీగా చేసేస్తాడు. సినిమా అంతా రాహుల్ బాడీలో స్టయిల్ ఉంటుంది. సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్`` అన్నారు.
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ - ``సినిమా ఈ నెల 21న విడుదలవుతుంది. 30 ఏళ్లుగా నన్ను అందరూ చూస్తున్నారు. అదే ఆశీర్వాదాన్ని నా పిల్లలకు అందిస్తారని భావిస్తున్నాను. ఏడాదిన్నర క్రితం సుకుమార్‌గారు ఫోన్ చేసి కథను ఎవరూ చేయకపోతే చెప్పండి నేను చేస్తా అని అన్నారంటే ఆ మాటే చాలు. ఆయనకు థాంక్స్. మా పిల్లల ఎదుగుదలలో సుకుమార్‌గారు మాకు ఎంతో అండగా నిలబడ్డారు. అలాగే సుకుమార్‌గారు, త్రివిక్రమ్‌గారు గైడెన్స్ ఇచ్చారు. అలాగే సి.కల్యాణ్‌గారు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన యలమంచిలి రవిశంకర్, బెక్కం వేణుగోపాల్‌లకు, మా టీమ్‌కి థాంక్స్. ఇలాంటి సందర్భంలో శ్రీహరిగారు లేకపోవడం నాకు పెద్ద లోటుగా ఉంది. ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నాను. మా సినిమాను విడుదల చేస్తున్న గీతాఆర్ట్స్ సంస్థ అధినేతకు, ఏషియన్ ఫిలింస్ సంస్థ సునీల్ నారంగ్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరం కష్టపడ్డాం. సినిమా చాలా బాగా వచ్చింది. బాగుంటేనే సినిమా చూడండి. తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ - ``రెండు రోజుల్లో అంటే ఈ నెల 21న సినిమా విడుదలవుతుంది. ఏడాదిన్నరగా నాన్న, అక్క చాలా కష్టపడ్డారు. వాళ్లు నా కోసం పడ్డ కష్టం చూసి బాధపడాలో.. నేను బాగా చేశానని చిరునవ్వు వారి ముఖంపై చూసి ఆనందపడాలో తెలియడం లేదు. కనఫ్యూజన్‌గా ఉంది. భవిష్యత్‌లో నా గురించి రేపు చేతులు కట్టుకునే స్థితి ఉండకుండా కష్టపడతానని ఈ సందర్భంగా నాన్న, అక్కకు చెబుతున్నాను. సుకుమార్‌గారు కథ విని బావుందని చెప్పడంతో మా సినిమా స్టార్ట్ అయ్యింది. ఆయనతో పాటు కల్యాణ్‌గారు, రవిగారు అందరూ మంచి సపోర్ట్‌ను అందించారు. మా మూవీ `అర్జున్ రెడ్డి, ఆర్.ఎక్స్ 100` కాదు.. `ఈ మాయ పేరేమిటో`. బావుంటే చూడమని నలుగురికి చెప్పండి లేకుంటే బాలేదని.. టైమ్ వేస్ట్ అని చెప్పండి. తారక్ అన్న ఆడియో సందర్భంగా సపోర్ట్ చేశారు. అలాగే సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ - ``విజయ్‌మాస్టర్‌కు నాకు మంచి అనుబంధం ఉంది. సినిమా చూశాను. చాలా బావుంది .క్యూట్ స్టోరీ. అందంగా, స్వీట్‌గా తెరకెక్కించిన లవ్‌స్టోరీ. తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ - ``నేను జగడం చేసేటప్పుడు విజయ్ మాస్టర్‌గారితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో రాహుల్ చిన్న పిల్లవాడు. తనను చూపించి వీడ్ని హీరోను చేస్తానని మాస్టర్‌గారు అనేవారు. నిజంగానే ఆయన గొప్ప కల కన్నారు. నేను లోపల నవ్వుకున్నాను కానీ ఈరోజు అది నిజమైంది. ఆయన తన కొడుకుని హీరో చేయడానికే కష్టపడ్డారేమో అనిపిస్తుంది. ఇంతకాలం తర్వాత రాహుల్ నటిస్తుంటే విజయ్ మాస్టర్ కళ్లలో టెన్షన్ తెలుస్తుంది. అదే తండ్రి ప్రేమంటే. రాహుల్‌లో నిజాయతీ ఉంది. తన ఎమోషన్ వృథా పోదు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. రాము కొప్పుల జీవితాంతం కష్టాలతో గడిచింది. కానీ చివరకు విజయ్ మాస్టర్ రూపంలో ఓ అవకాశం తనకు దక్కింది. రాహుల్‌కి కథ నచ్చడంతో తను బాగా ఫాలో అప్ పెట్టాడు. చివరకు విజయ్ మాస్టరే పూనుకుని కొడుకుతో ఈ కథను సినిమాగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ నెల 21న విడుదలవుతున్న ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com