బన్నీ రోల్‌ను సుక్కు అలా డిజైన్ చేశారట...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మరీ ఇంత మాస్ లుక్‌లో బన్నీని ఇప్పటి వరకూ ప్రేక్షకులు చూడలేదు. ఈ చిత్రంలో బన్నీ రోల్‌ను అడవిలో అణువణువు తెలిసిన లారీ డ్రైవర్‌గా సుక్కు డిజైన్ చేశారని టాక్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథను సుక్కు తెరకెక్కిస్తున్నారు.
బన్నీకి జోడిగా రష్మక మందన, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. బన్నీ నడిపే లారీ పేరు ‘పుష్ప’ అని తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. అద్భుతమైన ఛేజింగ్ సీన్‌ను ఇప్పటికే సుక్కు ప్లాన్ చేశారని సమాచారం. ‘రంగస్థలం’తో మాస్ సినిమాపై తన సత్తాను నిరూపించుకున్న సుక్కు.. ఈ సినిమాను కూడా బ్లాక్ బస్టర్ దిశగా నడిపిస్తారని చర్చ నడుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com