‘సాహో’ కోసం సుజిత్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే...!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు పలువురు పాత్రలు, టీజర్ సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తిని పెంచేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ న్యూస్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో ప్రతీసారి ‘సాహో’ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధా కపూర్, ఐటెంగార్ల్ ఇలా ఒక్కొక్కరూ షాకింగ్ రెమ్యునరేషన్స్ తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా.. డైరెక్టర్ రెమ్యునరేషన్ గురించి టాలీవుడ్లో పెద్ద చర్చేసాగుతోంది.
సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌లో సుమారు 3 నుంచి 5 శాతం వాటా సుజిత్‌కు రెమ్యునరేషన్‌గా ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి 2014లో ‘రన్ రాజా రన్’ సినిమా రిలీజైన అనంతరం ‘సాహో’ కోసం సుజిత్ ఆరేళ్లుగా కష్టపడుతున్నాడు. అయితే మధ్యలో బాహుబలి రెండు భాగాలు రావడం.. అయినప్పటికీ ఎలాంటి వెనకడుగేయకుండా ప్రభాస్‌తోనే సినిమా తీయడం విశేషమని చెప్పుకోవచ్చు. ఇవన్నీ అటుంచితే.. కేవలం ఓ చిన్న సినిమాను తీసిన డైరెక్టర్ మీద నమ్మకంతో అంత భారీ బడ్జెట్ పెట్టడం అంటే నిర్మాతలు చాలా డేర్ స్టెప్ వేశారని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా భారీ బడ్జెట్‌తో సినిమా తీసిన తర్వాత టాలీవుడ్, ఫిల్మ్‌నగర్‌లో సుజిత్‌కు ఎంత వాటా దక్కింది..? అనేది చర్చనీయాంశమైంది.
కాగా.. ‘సాహో’ ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com