చిరంజీవికి జోడి ఉంటుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాలనుకోవడం లేదట. వెంటనే తన 153వ సినిమా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. సాహో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నాడట. ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరగనున్నాయని చిరంజీవి తెలిపారు. చిరంజీవికి ఉన్న కమర్షియల్ స్టార్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని సుజిత్ కథలో పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
సినీ వర్గాల సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమాలో జోడి ఉండేలా సుజిత్ స్క్రిప్ట్‌ను మారుస్తున్నాడట. నిజానికి మలయాళంలో మోహన్‌లాల్‌కు జోడీ లేదు. కానీ తెలుగులో హీరోయిన్, డాన్సులు ఉండేలానే అనిపిస్తున్నాయి. చిరంజీవితో చర్చలు జరిగిన తర్వాత రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేసే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout