అన్నయ్యకు సుజిత్.. తమ్ముడికి కిషోర్!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ టాలీవుడ్‌ను ఏలేస్తున్నారు. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారి స్థానాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. అంతేకాదండోయ్.. వాళ్లే వచ్చి వారి వారి స్థానాలను ఫిల్ చేసుకుంటున్నారు. ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి ఫలితం లేకపోగా.. ‘ఖైదీ నంబర్-150’ సినిమాతో చిరు రీ ఎంట్రీ ఇచ్చి ‘నాకు నేనే పోటీ.. నాకెవ్వరూ రారు సాటి’ అన్నట్లుగా దూసుకెళ్తున్నాడు. రీ ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకూ ‘ఖైదీ నంబర్-150’, భారీ బడ్జెట్ చిత్ర ‘సైరా’లో నటించగా రెండూ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత చిరు ఏం చేయబోతున్నారు..? ఆగస్టులోనే సినిమా రిలీజ్ కానుంది కదా వాట్ నెక్స్ట్..? అనేదానిపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది.
అన్నయ్యకు సుజిత్!
ఈ క్రమంలో.. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రం రీమేక్‌లో నటిస్తారని తెలుస్తోంది. ఇది అక్కడ రూ. 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో.. రీమేక్ చేయాలని పట్టుబట్టి మరీ రైట్స్ కొన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ లెక్కలేనంత మంది తెరపైకి వచ్చారు. అయితే ఫైనల్‌గా వి.వి వినాయక్ దగ్గరికొచ్చి ఆగిందని వార్తలు వచ్చాయ్. అబ్బే అదేం కాదంట.. తాజాగా ‘సాహో’ సినిమా తన రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన కుర్ర డైరెక్టర్ సుజిత్.. ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కించనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి సుజిత్ ఖాళీగా ఉండటం.. మెగాస్టార్ సినిమా కావడంతో తనకు వచ్చిన అదృష్టంగా భావించిన సుజిత్ మారుమాట చెప్పకుండా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే ఇప్పటికే లెక్కలేనంత మంది మారడంతో ఫైనల్ సుజితేనని వార్తలు వినిపిస్తున్నాయ్.
తమ్ముడికి కిషోర్!
రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్‌ను తెలుగులో ‘వకీల్ సాబ్’ వస్తోంది. ఆ తర్వాత క్రిష్, హరీశ్ శంకర్, త్రివిక్రమ్ లైన్లో ఉన్నారట. అయితే వీటిలో క్రిష్, హరీశ్ సినిమాలపై అధికారిక ప్రకటన రాగా.. మిగిలిన దర్శకుల విషయంలో మాత్రం అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అయితే పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయి. తనకు ‘గోపాల గోపాల’ అనే మల్టీస్టారర్ మూవీతో మంచి సక్సెస్నిచ్చిన కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో పవన్ చేయనున్నాడట. దీంతో మరోసారి హిట్ కాంబో తెరపైకి రాబోతోందని మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments