డ్యామిట్ సీన్ రివర్స్.. సుజనా 400 కోట్ల ఆస్తుల వేలం!
Send us your feedback to audioarticles@vaarta.com
సుజనా చౌదరీ గుర్తున్నాడుగా.. అదేనండి 2019 ఎన్ని్కల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలవ్వడం, తన ఆస్తులను సీబీఐ, ఈడీల నుంచి తప్పించుకోవడాకి కమలనాథుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గుర్తొంచిందిగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కదా.. ఇక మనల్ని ఏ సంస్థలూ.. ఏ బ్యాంకులూ ఏమీ చేయలేవని అనుకున్నాడో ఏమోగానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. తీరా చూస్తే.. ఆయనకు సంబంధించిన రూ.400 కోట్ల విలువైన ఆస్తులు వేలానికి సంబంధించి ప్రకటన జారీ చేసింది. చెన్నైకి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గురువారం సాయంత్రం నోటీసులిచ్చింది.
అసలు కథ ఇదీ..!
హైదరాబాద్ వెంగళరావు నగర్‌కు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణ బకాయిలను చెల్లించనందున, ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయడంతో పాటు ఆ కంపెనీకి రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రకటనలో సుజనా చౌదరి, వై.శివలింగ ప్రసాద్ (లేట్), వై.జితిన్ కుమార్, వై.శివరామకృష్ణ. ఎస్టీ ప్రసాద్, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, సుజనా కేపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్, నియోన్ టవర్స్, సార్క్ నెట్ లిమిటెడ్ సంస్థల పేర్లను బ్యాంక్ ప్రకటించించడంతో ఎంపీకి ఊహించని షాక్ తగిలింది.
అనుకున్నదే జరిగిందిగా!
టీడీపీకి చెందిన ఎంపీలు బీజేపీలో చేరిన నాటి నుంచి నేటి వరకూ అవకాశం వచ్చినప్పుడల్లా సుజనా, సీఎం రమేశ్‌కు సంబంధించిన లెక్కల వ్యవహారాల నుంచి తప్పించుకోలేరని ఎంపీ జీవీఎల్ నర్సింహారావుతో పాటు ఒకరిద్దరూ హెచ్చరిస్తూనే వచ్చారు. అనుకున్నట్లుగానే తాజాగా సుజనాకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో బ్యాంకులు షాకిచ్చాయి. మొత్తానికి చూస్తే ఏదో అనుకుంటే డ్యామిట్.. మొత్తం సీన్ రివర్స్ అయ్యిందన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments