చంద్రబాబుపై సుజనా షాకింగ్ కామెంట్స్!
- IndiaGlitz, [Wednesday,September 11 2019]
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఒకప్పటి టీడీపీ ఎంపీ, ఆయనకు నమ్మకస్తుడైన సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందని.. ప్రజలు రివర్స్ ఎన్నికలు కోరుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరు. ఈ అంశం మాజీ సీఎం స్థాయిలో ఉండదని.. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. జమిలి ఎన్నికలపై నాకు సమాచారం లేదు. పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఆ తర్వాత టీడీపీ హయాంలోనూ కాలయాపన జరగడం వల్ల ట్రాక్ తప్పింది’ అని సుజనా వ్యాఖ్యానించారు.
నోరు మెదపని నేతలు!
అంటే ఒకప్పుడు తాను ఆ టీడీపీ అధినేత కిందే పనిచేశానని అని కూడా చూడకుండా.. అంతేకాదు 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. దేశ రాజకీయాల్లో కాకలు తీరిన నేత అని ఎరుగక.. ‘చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే’ అని ఆఫ్ట్రల్ అంటూ తీసిపారేశారన్న మాట. సుజనా ఈ మాటలు అనడం వెనుక ఆంతర్యమేంటో ఆయనకు.. చంద్రబాబుకే తెలియాలి మరి. అయితే సుజనా వ్యాఖ్యలకు మాత్రం ఇంతవరకూ టీడీపీ అధినేత గానీ.. తెలుగు తమ్ముళ్లు గానీ ఇప్పటివరకూ ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం.
వైసీపీ సర్కార్‌కు వార్నింగ్!
అంతటితో ఆగని సుజనా. ఏపీలో ఇటీవల సంభవించిన వరదల నిర్వహణలో ప్రభుత్వ విఫలమైందని విమర్శలు గుప్పించారు. ముంపునకు గురయ్యేందుకు ఆస్కారం లేని గ్రామాలు కూడా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జలదిగ్బంధానికి గురయ్యాయని.. ప్రభుత్వ విధానం ఇలాగే ఉంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఒకింత హెచ్చరించారు. రాజధాని అమరావతి విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోందని సుజనా మండిపడ్డారు.