కరోనా లాక్‌డౌన్‌తో మద్యం దొరకలేదని ఆత్మహత్యాయత్నం!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నేపథ్యంలో యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావట్లేదు. మరోవైపు నిత్యావసర సరకులకు సంబంధించిన షాపులు మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 07 వరకు ఓపెనింగ్‌లో ఉంటాయ్. అయితే.. మద్యం షాపులు తెరవకపోవడంతో చాలా చోట్ల మందుబాబు తెగ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల మద్యం షాపులకు కన్నాలు వేసి మందు బాటిల్స్ ఎత్తుకెళ్తున్నారు.
అయితే.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని మోడల్ కాలనీకి చెందిన మర్రివాడ రాంబాబు అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. మద్యానికి బానిసైన ఆయన లాక్ డౌన్ నేపథ్యంలో అది దొరక్కపోవడంతో కత్తితో మెడ కోసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే.. మద్యం దొరకలేదనే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేకుంటే ఇంకా ఏమైనా కారణాలున్నాయా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout