కరోనా లాక్‌డౌన్‌తో మద్యం దొరకలేదని ఆత్మహత్యాయత్నం!

కరోనా నేపథ్యంలో యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావట్లేదు. మరోవైపు నిత్యావసర సరకులకు సంబంధించిన షాపులు మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 07 వరకు ఓపెనింగ్‌లో ఉంటాయ్. అయితే.. మద్యం షాపులు తెరవకపోవడంతో చాలా చోట్ల మందుబాబు తెగ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల మద్యం షాపులకు కన్నాలు వేసి మందు బాటిల్స్ ఎత్తుకెళ్తున్నారు.

అయితే.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని మోడల్ కాలనీ‌‌కి చెందిన మర్రివాడ రాంబాబు అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. మద్యానికి బానిసైన ఆయన లాక్ డౌన్ నేపథ్యంలో అది దొరక్కపోవడంతో కత్తితో మెడ కోసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే.. మద్యం దొరకలేదనే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేకుంటే ఇంకా ఏమైనా కారణాలున్నాయా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

More News

స్పెయిన్ యువరాణిని బలితీసుకున్న కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా కాటుతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే కన్నుమూశారు. అయితే తాజాగా కరోనాతో ఇన్నిరోజులు పోరాడిన స్పెయిన్ యువరాణి మారియా థెరీసా

మీ అసౌకర్యానికి చింతిస్తున్నా.. కఠిన నిర్ణయాలు తప్పవ్..!

కరోనా నేపథ్యంలో దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు (లాక్‌డౌన్‌) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఆ విష‌యంలో నేనేం మార‌లేదు: రాజ‌మౌళి

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్‌స్టార్స్ అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’.

కరోనా నేపథ్యం : వైరల్ అవుతున్న ఈ తప్పుడు విషయాలు నమ్మకండి!

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెరికా, చైనా, ఇటలీ లాంటి పెద్ద దేశాల్లో గంట గంటకూ పెద్ద ఎత్తునే మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు

నాకు కరోనా సోకలేదు.. ఆందోళన వద్దు : కమల్

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెరికా, చైనా, ఇటలీ లాంటి పెద్ద దేశాల్లో గంట గంటకూ పెద్ద ఎత్తునే మరణాలు సంభవిస్తున్నాయి.