sudigali sudheer : వామ్మో... ‘‘గాలోడు’’ కోసం సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ అంతా..?
Send us your feedback to audioarticles@vaarta.com
కృషి, పట్టుదల, క్రమశిక్షణ వుంటే ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని రుజువు చేసిన వారు సినీ పరిశ్రమలో ఎందరో. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని తదితరులు ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తమ కష్టం మీద స్టార్స్‌గా ఎదిగారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు సుడిగాలి సుధీర్. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించిన సుధీర్.. తర్వాత తన ప్రతిభతో సినిమాల్లోనూ అడుగుపెట్టి మంచి మార్కులు కొట్టేశాడు. హీరోకి ఫ్రెండ్‌గా, కమెడియన్‌గా నటిస్తూ హీరో స్థాయికి ఎదిగాడు.
సాఫ్ట్వేర్ సుధీర్‌తో హీరోగా ఎంట్రీ:
‘‘సాఫ్ట్వేర్ సుధీర్’’ సినిమాతో హీరోగా మారిన ఆయన.. తర్వాత ‘‘వాంటెడ్ పండుగాడ్’’ చిత్రంలో మరోసారి హీరోగా అవకాశం దక్కించకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న మూడో చిత్రం ‘గాలోడు’. ఇందులో సుధీర్ సరసన గెహ్నీ సిప్పి హీరోయిన్గా నటిస్తుండగా.. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో సుధీర్ నటించాడు. డ్యాన్సులు, ఫైట్స్‌లో ఇరగదీశాడు. నవంబర్ 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. వూళ్లో ఏ పని పాటా లేని కుర్రాడు సిటీకి వచ్చి , సమస్యల్లో పడటం, వాటిని ఎలా ఎదుర్కొన్నాడనే దాని చుట్టూ ‘‘గాలోడు’’ సినిమా నడుస్తుంది.
గాలోడు హైప్‌కి కారణం సుధీర్ క్రేజే:
సినిమా మొత్తాన్ని సుడిగాలి సుధీర్ తన భుజాలపై మోసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ‘‘గాలోడు’’కి హైప్ రావడానికి కారణం సుధీర్ హీరో కావడమే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గాలోడు కోసం సుధీర్‌కి రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు పారితోషికంగా ముట్టినట్లుగా ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకప్పుడు అవకాశాల కోసం తిరిగి, డైలీ పేమెంట్ అందుకున్న సుధీర్ ఈ స్థాయికి చేరుకోవడం అభినందించదగ్గ విషయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments