బెల్లంకొండతో సుధీర్ వర్మ?
Send us your feedback to audioarticles@vaarta.com
స్వామిరారా, కేశవ వంటి థ్రిల్లర్ చిత్రాలతో విజయాలను అందుకున్న దర్శకుడు సుధీర్ వర్మ. ఈ దర్శకుడు శర్వానంద్‌తో రణరంగం సినిమాను డైరెక్ట్ చేసిన తర్వాత మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు. లేటెస్ట్ సమాచారం మేరకు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో సుధీర్ సినిమాను తెరకెక్కించబోతున్నాడని టాక్. రాక్షసుడు సినిమా సక్సెస్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నభా నటేశ్, అను ఇమ్మాన్యుయేల్, సోనూ సూద్ ఇతర తారాగణంగా నటిస్తున్నారు.
కాగా.. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోందని టాక్. తనదైన స్లయిల్లో సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని థ్రిల్లర్ పంథాలోనే తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాకు ముందుకు సుధీర్ వర్మ సురేష్ ప్రొడక్షన్స్‌లో ఓ కొరియన్ రీమేక్ సినిమాను తెరకెక్కిస్తాడని, విక్రమ్ వేద సినిమాను రీమేక్ చేస్తాడని.. ఇలా పలు వార్తలు వినిపించాయి. ఇప్పుడు బెల్లంకొండతో సుధీర్ సినిమా కూడా అలాంటిదేనా? నిజా నిజాలేంటి అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments