సుధీర్‌ని మెచ్చుకోవాల్సిందే
Send us your feedback to audioarticles@vaarta.com
జయాపజయాల మాట పక్కన పెడితే.. యువ కథానాయకుడు సుధీర్‌బాబుని ఓ విషయంలో మెచ్చుకు తీరాల్సిందే అంటున్నారు సినీ పరిశీలకులు. అది ఏ విషయంలో అంటే.. తన సినిమాల పేర్లను అచ్చ తెలుగు పదాలతోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం.
తొలి చిత్రం 'శివ మనసులో శ్రుతి' (షార్ట్ కట్ 'ఎస్.ఎం.ఎస్'ని టైటిల్‌గా హైలెట్ చేసినా.. టైటిల్ ఉద్దేశం తెలుగు మాటే) తో మొదలుకుని 'ప్రేమకథా చిత్రమ్', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'మోసగాళ్లకు మోసగాడు', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' తో పాటు రానున్న 'భలే మంచి రోజు' వరకు ఇదే సూత్రాన్ని పాటించాడు సుధీర్. మున్ముందు కూడా సుధీర్ ఇదే పద్ధతిని ఫాలో అవుతాడో లేదో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout