సుధీర్ వివాదానికి తెర తీసాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
`సమ్మోహనం`, `నన్నుదోచుకుందువటే` వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్‌తో నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న హీరో సుధీర్ బాబు. ఈయన నటించిన చిత్రం `వీర భోగ వసంత రాయలు`. ఈ చిత్రంలో సుధీర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. అక్టోబర్ 26న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఈ ట్రైలర్‌లో సుధీర్ బాబు పాత్రకు ఆయన డబ్బింగ్ చెప్పుకోలేదు.
ఈ విషయాన్ని ఆయన కూడా చెప్పాడు. కొన్ని కారణాలతో `వీర భోగ వసంత రాయలు` సినిమాలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పలేదు అంటూ సుధీర్ చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. ఏదైనా రెమ్యునరేషన్ ప్రాబ్లమా? లేదా? మరేదైనానా? అని తెలియదు కానీ.. మొత్తానికి వివాదానికి సుధీర్ తెర తీసినట్లేనిన ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments