Gaalodu: 'గాలోడు' ట్రైల‌ర్‌ విడుద‌ల‌

  • IndiaGlitz, [Friday,November 04 2022]

సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'గాలోడు'. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టినుండే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్‌కి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా 'గాలోడు' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌..

దాదాపు రెండున్న‌ర నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండ‌బోతుందో ముందే హింట్ ఇచ్చారు మేక‌ర్స్.. ఫ‌స్ట్ టైమ్ సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఒక‌వైపు మాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటూనే మ‌రోవైపు స్టైలీష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు సుధీర్. ఇక ''వ‌య‌సు త‌క్కువ 'షో'లు ఎక్కువ‌, నువ్వు శ‌నివారం పుట్టావా? శ‌నిలా త‌గులుకున్నావ్‌, రామాయ‌ణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్క‌డ అంద‌రు మాయ లేడీలే..వంటి డైలాగ్స్‌లో ఎంట‌ర్‌టైన్ చేస్తూనే 'వాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజ‌ర్‌రా వాడు, రాక్ష‌సుల గురించి పుస్త‌కాల్లో చ‌దివాను, విన్నాను మొట్ట‌మొద‌టి సారి వీడిలో చూశాను సార్' వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచానాల్ని రెట్టింపు చేశాయి. గెహ్నాసిప్పి గ్లామ‌ర్‌, స‌ప్త‌గిరి కామెడీ టైమింగ్ ట్రైల‌ర్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సి. రాంప్ర‌సాద్ విజువ‌ల్స్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్ లెవ‌ల్‌లో ఉన్నాయి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'గాలోడు' సినిమా న‌వంబ‌రు 18న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌ త‌దిత‌రులు

More News

BiggBoss: రేవంత్ బూతు పురాణం... ఆదిరెడ్డికి మస్కా కొట్టిన గీతూ, సూర్య జ్ఞాపకాలతో ఇనయా

బిగ్‌బాస్ 6 తెలుగులో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ యమ జోరుగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అంతా పులుల్లా రెచ్చిపోతున్నారు.

Posani Krishna Murali : విధేయతకు అందలం.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

pawan kalyan : ఇల్లు, కార్యాలయం.. నీడలా వెంటాడుతున్న ఆగంతకులు, పవన్ హత్యకు కుట్ర ..?

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌కు ఎవరైనా ముప్పు తలపెట్టే అవకాశాలు వున్నాయా అంటూ అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

BiggBoss: బిగ్‌బాస్‌లో ‘‘బెడ్ రూమ్’’ కామెంట్స్...ఇనయాపై శ్రీహాన్- శ్రీసత్య ఫైర్, ఆదికి సీక్రెట్ టాస్క్

బిగ్‌బాస్‌లో ఇంట్రెస్టింగ్ టాస్క్‌లతో ఆడియన్స్‌కి అసలు సిసలు మజాను పంచుతున్నారు నిర్వాహకులు.

Matti Kusti: విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' ఫస్ట్ లుక్‌

మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగానిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'.