'మనం' రచయితతో సుధీర్‌బాబు?
Send us your feedback to audioarticles@vaarta.com
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో సందడి చేసిన హర్షవర్థన్.. గుండెజారి గల్లంతయ్యిందే, మనం చిత్రాలతో మాటల రచయితగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న హర్ష.. ఆ సినిమా తరువాత యువ కథానాయకుడు సుధీర్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమకథా చిత్రమ్ తరువాత సరైన విజయం లేని సుధీర్ బాబు.. ఇటీవలే శమంతకమణి చిత్రంతో పలకరించాడు.
అతి త్వరలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాతే హర్షవర్థన్ చిత్రాన్ని సుధీర్ పట్టాలెక్కించనున్నాడని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. హర్షవర్థన్ చెప్పిన పాయింట్ సుధీర్‌కి బాగా నచ్చిందని.. ఆయన నెరేషన్ స్టైల్ కూడా నచ్చి సినిమాకి వెంటనే ఓకే చెప్పారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గుడ్ బ్యాడ్ అగ్లీ ని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మాటల రచయితగా సక్సెస్ అయిన హర్ష.. దర్శకుడిగానూ మార్కులు సంపాదిస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com