శ్రీదేవి సోడా సెంటర్ టీజర్: అప్పటి నుంచి నా పేరు సోడాలు శ్రీదేవి అయింది

  • IndiaGlitz, [Friday,July 30 2021]

హీరో సుధీర్, పలాస డైరెక్టర్ కరుణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా పాటలు, టీజర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన మాస్ స్పెషల్ సాంగ్ 'మందులోడా' యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ పాత్రని పరిచయం చేసేలా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటించింది. పల్లెటూరి యువతిగా ఆమె పాత్ర గమ్మత్తుగా ఉంది. టీజర్ లో ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

'నీలాగే ఒకడు సోడా సోడా అని మా కొట్టుదగ్గర తిరిగితే సోడా తీసి ఆడి నెత్తిమీద కొట్టా' అంటూ ఆనంది పల్లెటూరి యాసలో సుధీర్ బాబుకి వార్నింగ్ ఇస్తున్న డైలాగ్ చాలా బావుంది. ఈ మూవీ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా బ్యూటిఫుల్ గా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.

దర్శకుడు కరుణ కుమార్ పలాస చిత్రాన్ని ఎమోషల్ గా నడిపించారు. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఈ మూవీలో కమర్షియల్ అంశాలు ఎక్కువగానే ఉన్నట్లు ఉన్నాయి. ఆనంది పాత్రలో చలాకీతనం, చిలిపితనం కలబోసి ఉన్నాయి. ఇక సుధీర్ బాబు పల్లెటూరి యువకుడిగా గడ్డం లుక్ తో కనిపిస్తున్నాడు.

యాత్ర చిత్రాన్ని నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

More News

ఆఫీషియల్: స్టైలిష్ పోస్టర్ తో రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్.

పోసానికి కరోనా.. దర్శక, నిర్మాతలు నన్ను క్షమించాలి అంటూ..

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా పోసాని తెలియజేశారు.

సోషల్ మీడియాలో 'అక్కినేని' తొలగించిన సామ్.. అందుకోసమేనా!

క్రేజీ హీరోయిన్ సమంత సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.

పెళ్లి వార్తలపై సుమంత్ క్లారిటీ.. వెడ్డింగ్ కార్డు వెనుక ఇంత జరిగిందా!

హీరో సుమంత్ రెండో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ న్యూస్ అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో వైరల్ అయింది.

ఏపీలో తెరుచుకోనున్న థియేటర్లు.. 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి

అసలే కరోనా విపత్తుతో థియేటర్లు పరిస్థితి దయనీయంగా మారింది.