'శ్రీదేవి సోడా సెంటర్' విడుదల తేదీ ఖరారు

  • IndiaGlitz, [Thursday,August 12 2021]

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ మధ్యే ఈ సినిమా నుంచి విడుదలైన నాలో ఇన్నాళ్లుగా కనిపించని.. అంటూ సాగే డ్యూయెట్‌కు కూడా చాలా మంది స్పందన వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర్చింది. దాన్ని దినకర్, రమ్య బెహ్రా అంతే అద్భుతంగా ఆలపించారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఆగస్ట్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది శ్రీదేవి సోడా సెంటర్. తమ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటున్నారు మేకర్స్. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది తదితరులు..

More News

'పెళ్లి సంద‌D'... టైటిల్ సాంగ్ విడుద‌ల

``పట్టు చీర‌ల త‌ళ‌త‌ళ‌లు.. ప‌ట్ట గొలుసుల గ‌ళ‌గ‌ళ‌లు

తుదిద‌శ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న అడివి శేష్‌ ‘మేజర్‌’

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నమేజ‌ర్ సినిమా చివ‌రి షెడ్యూల్‌ షూటింగ్ ఈ రోజు (ఆగ‌స్ట్‌12)ప్రారంభ‌మైంది.

'రాజ రాజ చోర‌' .. ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజ రాజ చోర‌`. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.

రాజశేఖర్ నటిస్తున్న 'శేఖర్' షూటింగ్ అరకు లో మళ్లీ షురూ

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. 'మ్యాన్ విత్ ద స్కార్' అనేది ఉపశీర్షిక.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ఇదే

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. యాక్ష‌న్ సినిమాల‌ను చేయ‌డానికి చాలా ఆస‌క్తిని చూపుతుంటారు.