తన తదుపరి చిత్రం గురించి క్లారిటీ ఇచ్చిన సుధీర్....
Send us your feedback to audioarticles@vaarta.com
నేను విలన్ గానే ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా విలన్ గానే ఎంట్రీ ఇచ్చానని అన్నాడు సుధీర్ .బాగి చిత్రంలో విలన్ గా నటించిన సుధీర్ బాబు నటనకు మంచి అప్లాజ్ వస్తున్న నేపథ్యంలో సుధీర్ బాబు ఈ సినిమాకు సంబంధించి తన భావాలను పంచుకున్నారు. ఎస్.ఎం.ఎస్ సినిమాలో కొన్ని ఫైట్ సీన్స్ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాను. దాన్ని చూసి నన్ను బాగి సినిమా కోసం కాంటాక్ట్ చేశారు.
చిన్న పాత్రమో అనుకుని నో చెప్పాలనుకున్నాను. కానీ కథ వినగానే ఇంప్రెస్ అయ్యి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ గోపీచంద్ బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్నాను. తెలుగు, హిందీలో ఈ సినిమా ఉంటుందన్నారు సుధీర్ అయితే అంతకంటే ముందు భలే మంచి రోజు కో డైరెక్టర్ శ్రీరాంరెడ్డి దర్శకత్వంలో మే నెలాఖరు నుండి తెలుగులో ఓ చిత్రాన్ని చేయబోతున్నానని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments