Sudheer Babu : సుధీర్ బాబు హీరోగా 'హంట్' టైటిల్ ఖరారు

  • IndiaGlitz, [Monday,August 29 2022]

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'హంట్' టైటిల్ ఖరారు చేసినట్లు ఈ రోజు వెల్లడించారు.

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్ ఫిల్మ్. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సులు చాలా సహజంగా, కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటాయి. కనిపించని శత్రువు కోసం జరిపే వేట ఈ సినిమా ప్రధాన కథాంశం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం. 'ప్రేమిస్తే' భరత్ తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రమిది. కథ విన్న వెంటనే ఎగ్జైట్ అయ్యి ఓకే చెప్పారు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా బావుంటుంది'' అని అన్నారు.

'హంట్' సినిమాలో నటీనటులు: సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.

'హంట్' సినిమా సాంకేతిక వర్గం : ఆర్ట్ డైరెక్టర్ : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరోప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్‌, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.

More News

Nagarjuna - Tabu Relation: ఇన్నేళ్లయినా ఆగని రూమర్లు.. టబూతో ‘‘రిలేషన్‌’’పై స్పందించిన నాగార్జున

అక్కినేని నాగార్జున.. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరు.

ZEE5 లో “హలో వరల్డ్ ” స్ట్రీమింగ్  స్టార్ట్ అయిన కొద్దిరోజుల్లోనే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ సాధించడం అంటే మాములు విషయం కాదు...అనురాధ గూడూరు

ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషలలో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా ZEE5 ప్రేక్షకులకు అందిస్తోంది.

Adavi Donga Movie : మత్తు ఇవ్వకుండా.. ‘‘అడవి దొంగ’’ సినిమా చూపిస్తూ, గాంధీలో అరుదైన సర్జరీ

ప్రజల ప్రాణాలను కాపాడటం వైద్యుల కర్తవ్యం. ఈ క్రమంలో కొందరికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.

crocodile Attack: వెంటాడిన మొసళ్లు.. చిన్నారి సాహసం, ఆన్‌లైన్‌ని షేక్ చేస్తోన్న వీడియో

నీటిలో మొసలికి బలం ఎక్కువగా వుంటుందంటారు పెద్దలు. నీటిలో వుంటే భారీ ఏనుగునైనా ఖతం చేస్తుంది.

Nitin - J. P. Nadda Meet : హీరో నితిన్‌తో భేటీకానున్న జేపీ నడ్డా.. అంతుచిక్కని బీజేపీ వ్యూహం

తెలంగాణలో అధికారం అందుకోవడంతో పాటు ఏపీలోనూ బలపడాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది బీజేపీ.