సెప్టెంబర్ 21న "నన్నుదోచుకుందువటే" గ్రాండ్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం... హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ గా సుధీర్‌బాబు నటించగా.. అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ కనిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న నన్నుదోచుకుందువటే చిత్రానికి సంబంధించిన టీజర్ ని జులై 14న రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కి అందరూ కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నాం. సమ్మెహనం లాంటి మంచి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత సుధీర్‌బాబు గారి నుంచి వస్తున్న చిత్రం కావటంతో ప్రేక్షకుల నుంచి అంచనాలు భారీగా వున్నాయి.
సుధీర్ బాబు గారి ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్ బాబు గారికి స్పెషల్ గా థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా అనుకున్న ప్రకారం పూర్తి చేశాం.
సినిమా మీదున్న నమ్మకంతో ప్రమోషన్ ను కూడా భారీగా ప్లాన్ చేశాం. అందుకు ఈ చిత్ర ప్రమోషన్ లో తెలుగు ప్రేక్షకులందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకూడదనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ స్టోరీ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. అని అన్నారు.
చిత్ర కథానాయకుడు, నిర్మాత సుధీర్ బాబు మాట్లాడుతూ ... మా సొంత బ్యానర్ సుధీర్ బాబు ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న నన్ను దోచుకుందువటే చిత్రాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ ఆర్.ఎస్.నాయుడు చాలా మంచి కథ స్క్రీన్ ప్లే తో సినిమా రూపొందించాడు.
టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. సమ్మోహనం వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడం.... నా సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతామనే నమ్మకం ఉంది.
అజనీష్ మ్యూజిక్, సురేష్ కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. హీరోయిన్ నభ నటేష్ చాలా బాగా నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విధంగా సినిమా వచ్చింది. సెప్టెంబర్ 21న మీ ముందుకు వస్తున్నాం.... అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments