జూలై 14న 'నన్నుదోచుకుందువటే' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
సమ్మెహనం తొ తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసుకున్న హీరో సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో టాలెంట్‌డ్ దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే .
ఈ చిత్రం మెదటి లుక్ పోస్టర్ నుండి ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూలై 14న 10:02 నిలకు టీజర్ ని విడుదల చేస్తున్నారు. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడదల తేది ని ఎనౌన్స్ చేస్తారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుదీర్‌బాబు ప్రోడక్షన్స్ లో నన్నుదోచుకుందువటే చిత్రానికి సంబందించిన టీజర్ ని జులై 14న రిలీజ్ చేస్తున్నాము. ఈ చిత్రం ప్రోడక్షన్ విలువలు ఎక్కడా తగ్గకూడదు అనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు చేస్తున్నారు.
కథ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. మిగతా వివరాలు ఎనౌన్స్ చేస్తాం. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments