సుధీర్‌బాబు - ఇంద్రగంటి చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన 'జెంటిల్‌మేన్' ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ దర్శక నిర్మాతలు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో గురువారం ఉదయం జరిగాయి. మణిరత్నం 'చెలియా' సినిమాలో నాయికగా నటించి అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ "గురువారం పూజా కార్యక్రమాలను నిర్వహించాం. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో మా సంస్థలో మేం నిర్మించిన 'జెంటిల్‌మేన్' ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ తాజా సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సుధీర్‌బాబుగారికి పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. డిసెంబర్ 11 నుంచి నిరవధికంగా షూటింగ్ చేస్తాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మేలో సినిమా విడుదల చేస్తాం. హైదరాబాద్, హిమాచల్‌ప్రసాద్, ముంబైలోని సరికొత్త లొకేషన్లలో తెరకెక్కిస్తాం" అని చెప్పారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ "అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది" అన్నారు.
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, నరేశ్, తనికెళ్ల భరణి, రోహిణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్‌శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మేకప్: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్. మనోజ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, ప్రొడక్షన్ కంట్రోలర్: చంద్రమోహన్, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments