మల్టీస్టారర్ చేస్తున్న సుధీర్ దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సుధీర్ బాబుతో భలే మంచి రోజు సినిమాను రూపొందించిన యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తన తదుపరి చిత్రానికి రెడీ అయిపోయాడు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా ఓ మల్టీస్టారర్ కావడం. నలుగురు యంగ్ హీరోస్ ఈ సినిమాలో నటించబోతున్నారట. అందులో ముగ్గురు హీరోస్ ఓకే అయిపోయారు. నారారోహిత్, నాగశౌర్య, సందీప్‌కిషన్‌లు స్క్రిప్ట్ వినగానే సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. మరి నాలుగో హీరో ఎవరు నటిస్తారనేది ఇంట్రెస్ట్‌ను కలిగిస్తుంది. నలుగురు యువకులు ఓ పని కోసం ఎం చేశారనేదే కథ. ఈ సినిమాలో మరో రెండు కీలకపాత్రల్లో కూడా ప్రముఖ నటులే నటించబోతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments