డైరెక్టర్‌తో సుధీర్‌బాబుకి విబేధాల కారణమా?
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా మూవీ మేకింగ్‌లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు చిన్న చిన్న వాగ్వాదాలు నడుస్తుంటాయి. కానీ అవేం మరీ పెద్దవైతే తప్ప బయటకు రావు. ఇప్పుడు సుధీర్‌బాబు నటించిన చిత్రం `వీరభోగ వసంత రాయలు` సినిమా విషయంలో డైరెక్టర్ ఇంద్ర, హీరో సుధీర్‌కి మధ్య గొడవ జరిగింది. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు, శ్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంలో సుధీర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడతారు.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో తన పాత్రను వెరిఫై చేసుకున్న సుధీర్ పాత్రను ఎడిట్ చేయమని డైరెక్టర్ ఇంద్రని కోరారు. అయితే ఇంద్ర అందుకు నిరాకరించారట. ఆ కారణంగానే సుధీర్ డబ్బింగ్ చెప్పకుండా నిరాకరించాడు. సుధీర్ ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించకపోయినా.. అసలు విషయం బయటకు పొక్కింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com