సూపర్ స్టార్ మహేష్ తర్వాత నేషనల్ బ్రాండ్ కి సుధీర్ బాబు

  • IndiaGlitz, [Monday,December 14 2015]

మన సౌత్ లో టాప్ బ్రాండ్ అంబాసిడర్ సూపర్ స్టార్ మహేష్ అని చెప్పాలి. థమ్స్ అప్ , నవ రత్న ఆయిల్ , యునివరసల్ ఇలా చాల బ్రాండ్స్ యాడ్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించారు. 2012 లో థమ్స్ అప్ కి నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా థమ్స్ అప్ యాడ్ లో నటించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బావ యువ హీరో సుదీర్ బాబు కూడా నేషనల్ బ్రాండ్ యాడ్ లో నటించాడు.

కేవలం 5 సినిమాల్లో హీరో గా నటించిన సుధీర్ బాబు యూత్ లో చాల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సరి కొత్త పాత్రలతో ముందుకు కెరీర్ లో దూసుకుపోతున్న సుధీర్ బాబు కి నేషనల్ రేంజ్ లో పాపులారిటీ రానుంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ కంపెనీ అయిన " హాల్స్ " నేషనల్ వైడ్ గా తీసే యాడ్ లో సుధీర్ బాబు కనిపించనున్నాడు. హాల్స్ కంపెనీ వాళ్ళు కొత్తగా " లెమన్ హనీ " ఫ్లేవర్ ని ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా తీసే సరి కొత్త యాడ్ లో సుధీర్ బాబు ని తీసుకున్నారు.

సుధీర్ బాబు తాజా చిత్రం " భలే మంచి రోజు " సినిమా ఈ నెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. భలే మంచి రోజు సినిమా ఆడియో కి , ట్రైలర్ కి మంచి స్పందన రావడమే కాకుండా సినిమా మీద భారి అంచనాలు ఉన్నాయి. అదే విధంగా సుధీర్ బాబు " భాగి " అనే బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ హీరో గా వస్తున్న భాగి లో సుధీర్ బాబు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.

More News

జనవరి 1న వస్తున్న 'చిత్రం భళారే విచిత్రం'

చాందిని ప్రధాన పాత్రలో భాను ప్రకాష్ బలుసు తెరకెక్కించిన కామెడీ థ్రిల్లర్ చిత్రం భళారే విచిత్రం.పి.ఉమాకాంత్ నిర్మించిన ఈ చిత్రంలో మనోజ్ నందం,అనిల్ కళ్యాణ్ ప్రధాన పాత్రలు పోషించారు.

హ్యాపీ బర్త్ డే టు రానా..

లీడర్ సినిమాతో కథానాయకుడుగా తెలుగు తెరకు పరిచయమైన యువ హీరో దగ్గుబాటి రానా.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ నిర్మించడం విశేషం.

చిన్న చిత్రాలకు పెద్ద నిర్మాతలు సపోర్ట్ గా ఉండాలి - యం.యం.కీరవాణి

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం‘జత కలిసే’.

'సౌఖ్యం' పాటలు విడుదల

భవ్య క్రియేషన్స్ బ్యానర్పై గోపీచంద్,రెజీనా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సౌఖ్యం.ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.

రాజ్ తరుణ్ దర్శకత్వం?

రాజ్ తరుణ్ కి దర్శకత్వం చేయాలన్నది కల.అందుకే దర్శకత్వ శాఖలో పనిచేశారు.అనూహ్యంగా ఉయ్యాల జంపాలా సినిమాతో హీరోగా టర్న్ అయిన రాజ్ తరుణ్ అప్పుడే మూడు హిట్లను ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.