కెరీర్ లోనే బెస్ట్ అంటున్న సుధీర్ బాబు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.ఎం.ఎస్, ప్రేమకధా చిత్రమ్, క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...చిత్రాల హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం భలే మంచి రోజు. ఈ చిత్రాన్ని శ్రీరాం ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్నివిజయ్, శశి నిర్మిస్తున్నారు. భలే మంచి రోజు.. తన కెరీర్ లోనే బెస్ట్ ఆడియో అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేసారు. సన్ని ఎం.ఆర్ అందించిన ఆడియో అందరికీ నచ్చుతుంది అంటున్నాడు.
ఈ సినిమా కథ అంతా ఒకే రోజులోనే జరుగుతుందట. ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా చక్కని స్ర్కీన్ ప్లే తో ఈ సినిమా రూపొందింది. ఖచ్చితంగా ఆడియోన్స్ ను ఆకట్టుకుంటుందని హీరో సుధీర్ బాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఇంకా ఫైనల్ కాలేదు. అప్పుడే ట్విట్టర్ లో ప్రమోషన్ స్టార్ట్ చేసేసాడు. మరి హీరో సుధీర్ బాబు నమ్మకం నిజమవుతుందో లేదో..? చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com