సుధాకర్ కోమాకుల క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'రీసెట్'

  • IndiaGlitz, [Thursday,November 12 2020]

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా ‘, ' నువ్వు తోపు రా' తదితర చిత్రాలతో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల 'రీసెట్' పేరుతో మరో విభిన్నమైన చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా అజ్జు మహాకాళి దర్శకునిగా పరిచయమౌతున్నారు. సుఖ స్టూడియోస్ సమర్పణలో హైలైట్ విజువల్స్, కారా బూందీ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ రోజు (నవంబర్ 12) హీరో సుధాకర్ కోమాకుల పుట్టినరోజు. ఈ సందర్బంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

దర్శకుడు అజ్జు మహాకాళి మాట్లాడుతూ- ''న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీ లో డిప్లమో ఇన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసాను. సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన 'నువ్వు తోపు రా' కి కథ- మాటలు అందించాను. దర్శకునిగా ఇదే నా తొలి ప్రయత్నం. కథ నచ్చి సుధాకర్ వెంటనే ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. లాక్ డౌన్ 1.0 టైం లో జరిగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రపంచం లాక్ డౌన్ అయినాకనే అతని ప్రపంచం ఓపెన్ అయ్యింది. ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే- వాస్తవం, కల్పితం కన్నా కిరాక్ ఉంటది. డిసెంబర్ లో చిత్రీకరణ మొదలుపెడతాం'' అని తెలిపారు.