BiggBoss: సుదీప ఎలిమినేషన్... గీతూను ఆడేసుకున్నారుగా
Send us your feedback to audioarticles@vaarta.com
అనుకున్నదే అయ్యింది బిగ్‌బాస్ నుంచి పీంకి సుదీప ఎలిమినేట్ అయ్యారు. ఈమె హౌస్‌ను వీడనుందని ముందే లీకైన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే తతంగం నడిచింది. మరి ఆదివారం ఎపిసోడ్ ఎలా నడిచిందో చూస్తే... ఎప్పటిలాగే నాగార్జున స్టైలిష్ లుక్‌లో కనిపించారు. రాగానే ఇంటి సభ్యుల్ని రెండు గ్రూపులుగా విభజించి ‘‘బొమ్మలతో పాట’’ అనే గేమ్ ఆడించారు. బొమ్మలు చూపించి.. ఆ బొమ్మల ద్వారా పాటేంటో చెప్పాలి. పాట కరెక్ట్‌గా గెస్ చేశాక.. కంటెస్టెంట్స్‌తో డ్యాన్స్ చేయించారు నాగ్. తర్వాత ‘‘ఎవరికి ఏ డైలాగ్ ’’ అనే గేమ్ నవ్వులు పూయించింది. ‘‘అవసరానికి దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు విలన్లు లేరీ నాటకంలో ’’ అనే డైలాగ్ గీతూ మెడలో వేశాడు బాలాదిత్య. తర్వాత ‘‘సొల్లాపు దమ్ముంటే నన్నాపు’’ డైలాగ్ తీసి సూర్య మెడలో వేసింది ఇనయా. 'నా పేరు శివ నాకు కొంచెం మెంటల్' అనే డైలాగ్ ను ఫైమా.. సుదీప మెడలో వేసింది. 'చూడు ఒకవైపే చూడు.. రెండోవైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్' అనే డైలాగ్ ను ఇనయా మెడలో వేశాడు శ్రీహాన్. 'నువ్ అరిస్తే అరుపులే.. నేను అరిస్తే మెరుపులు' అనే డైలాగ్ ను ఆదిరెడ్డి , రోహిత్‌లు ఒకరికొకరు ఇచ్చుకున్నారు.
గేమ్స్ ఆడిస్తూనే నామినేషన్స్‌లో వున్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు నాగ్. నిన్న శ్రీసత్య సేఫ్ అవ్వగా.. ఈరోజు ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, రాజ్, మెరీనా, గీతూలు తప్పించుకున్నారు. చివరికి బాలాదిత్య, సుదీప మాత్రమే మిగలడంతో వారిద్దరికి రెండు బ్యాటరీలు ఇచ్చారు నాగ్. వాటిలో ఎవరి బ్యాటరీ ఛార్జీంగ్ ఎక్కువగా వుంటే వాళ్లు సేఫ్.. తక్కువగా వున్న వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఇందులో సుదీప బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా వుండటంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు.
ఈ మాట వినగానే హౌస్ మొత్తం షాక్ అయ్యింది. బాలాదిత్య, మెరీనాలు కంటతడి పెట్టుకున్నారు. వేదిక మీదకు వచ్చిన సుదీపకు తన జర్నీ చూపించారు నాగ్. తర్వాత ఆమెకు కూరగాయల టాస్క్ ఇచ్చారు . ఇంటి సభ్యుల నేచర్ ఆధారంగా అక్కడ వుంచిన వెజిటబుల్స్‌తో పోల్చాలని ఆయన చెప్పారు. దీనిలో భాగంగా.. గీతూ 'వంకర టింకర' అని ఆమెకి అల్లం.. 'షార్ప్ టంగ్' అని పచ్చిమిర్చిని రేవంత్ కి .. 'హార్డర్ అవుట్ సైడ్.. సాఫ్ట్ ఇన్సైడ్' అనేది ఆదిరెడ్డికి ఇచ్చింది. అర్జున్ కి 'కన్ఫ్యూస్డ్' అని.. 'హైడింగ్ బిహైండ్ మాస్క్' అనేది శ్రీహాన్ కి ... 'లీస్ట్ లైక్డ్' అనేది ఇనయాకుగీతూ 'వంకర టింకర' అని ఆమెకి అల్లం ఇచ్చింది. 'షార్ప్ టంగ్' అని మిర్చిని రేవంత్ కి ఇచ్చింది. 'హార్డర్ అవుట్ సైడ్.. సాఫ్ట్ ఇన్సైడ్' అనేది ఆదిరెడ్డికి.. అర్జున్ కళ్యాణ్ కి 'కన్ఫ్యూస్డ్' అని.. 'హైడింగ్ బిహైండ్ మాస్క్' అనేది శ్రీహాన్ కి .. 'లీస్ట్ లైక్డ్' అనేది ఇనయాకు .. 'ఇమ్మెచ్యూర్డ్' అనే ట్యాగ్ ఫైమాకి ఇచ్చింది. అనంతరం ఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పి బిగ్‌బాస్‌ను వీడింది.
ఇకపోతే.. ఈరోజు చెప్పుకోవాల్సిన మరో విషయం గీతూ గురించే. ఎప్పుడూ లేనిది నాగ్ ఆమెను ఓ ఆటాడుకున్నారు. గీతూ నడిస్తే చాలా స్టైల్‌గా వుంటుందని నాగ్ చెప్పగా... దానికి పుష్ప స్టైల్‌లో నడిచి చూపించాడు రేవంత్. తర్వాత రేవంత్‌ను స్టోర్ రూమ్‌కు వెళ్లు అని నాగ్ ఆదేశించగా... మధ్యలో కలగజేసుకున్న గీతూ... రేవంత్‌కి కాలు బాలేదని, ఈసారి ఇంకెవరినైనా పంపండి అని కోరింది. దీంతో ఎవరో ఎందుకు నువ్వే వెళ్లు అంటూ గీతూకు చెప్పారు నాగ్. చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్లు బద్ధకంగా లేచి నడుస్తుంటే వయసొచ్చినా చిరుతలా వున్నావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు నాగ్. కాదు సార్.. వయసైపోయిన చిరుత అంటూ బాలాదిత్య కౌంటర్ ఇచ్చారు. అలా కాసేపు గీతూను ఆడుకున్నారు నాగ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com