సుదీప్ డైవ‌ర్స్

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

ఈగ సినిమాతో తెలుగులో త‌న న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన సుదీప్ త‌న 14 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లికారు. 2001లో ఆయ‌న ప్రియ‌ను వివాహ‌మాడారు. ఈ దంప‌తుల‌కు జాన్వి అనే కూతురు కూడా ఉంది. ఇద్ద‌రు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

వీరికి శ‌నివారం విడాకులు మంజూర‌య్యాయి. కుమార్తె జాన్వి త‌న త‌ల్లి ద‌గ్గ‌ర పెర‌గ‌డానికి సుదీప్ అంగీక‌రించారు. సుదీప్ ప్ర‌స్తుతం ముడింజా ఇవ‌న పుడి అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఇందులో నిత్యామీన‌న్ నాయిక‌. ఆయ‌న కీల‌క పాత్ర‌లో న‌టించిన పులి కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

More News

న‌వంబ‌ర్ నుంచి సింగం3

సింగం3 షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి మొద‌లుకానుంది. య‌ముడు, సింగం2 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌రి ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

అక్టోబ‌ర్‌లో షేర్‌

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన షేర్ అక్టోబ‌ర్ రెండో వారంలో విడుద‌ల కానుంది. మ‌ల్లికార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సీక్వెల్ ఆలోచ‌న‌లో మ‌నోజ్..?

మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

హ్యాపీ బ‌ర్త్ డే టు అమ‌ల అక్కినేని

విద్యావంతురాలుగా...క్లాసిక్ డాన్స‌ర్ గా..క‌ధానాయిక‌గా...బాధ్య‌త గ‌ల ఇల్లాలిగా..మాత్రుమూర్తిగా..బ్రూ క్రాస్ సొసైటీ ఫౌండ‌ర్ గా....

తిరుప‌తిలో మ‌హేష్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.