సుదీప్ డైవర్స్
- IndiaGlitz, [Saturday,September 12 2015]
ఈగ సినిమాతో తెలుగులో తన నటనను కనబరిచిన సుదీప్ తన 14 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. 2001లో ఆయన ప్రియను వివాహమాడారు. ఈ దంపతులకు జాన్వి అనే కూతురు కూడా ఉంది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
వీరికి శనివారం విడాకులు మంజూరయ్యాయి. కుమార్తె జాన్వి తన తల్లి దగ్గర పెరగడానికి సుదీప్ అంగీకరించారు. సుదీప్ ప్రస్తుతం ముడింజా ఇవన పుడి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నిత్యామీనన్ నాయిక. ఆయన కీలక పాత్రలో నటించిన పులి కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.